అమ్మాయి దగ్గరికి కార్ లో (18 గంటలు కారు లో, మధ్య లో బ్రేక్ తీసుకుని) వెళదామని ప్లాన్ చేసాం sudden గా. ఇంతలో భోరున వర్షం, సుడి గాలి, పెను తుఫాను లాగ వుంది. ఇదేంటి రా బాబు అనుకున్నాం.. (మొదటి సిగ్నల్) అన్నీ సర్దటం మొదలుపెట్టాం… ఈ లోపు కరెంటు పోయింది. (రొండో సిగ్నల్).. సరే కరెంటు తో పని ఏముంది లే అనుకున్నాం.. అన్ని సర్దేటప్పటికి 2 గంటలు పట్టింది (అంటే అమ్మాయి వస్తువులు వగైరా వగైరా ఉన్నాయి కదా.. అందుకు రెండు గంటలు).
చీకటి లో నే candle పెట్టుకుని.. ఎలక్ట్రానిక్ లాంతరు పెట్టుకుని సర్దుకున్నాం. ఇంకా కరెంటు రాలేదు.. సరే కారు garage లోనే ఉండిపోయింది.. (మూడో సిగ్నల్) ఇప్పుడు ఎలా తీయాలి? సరే manual గా గ్యారేజ్ పైకి తీసాను. కారు బయటకి తీసాను చీకట్లో. ఇంత లోపు ఫోన్, లాంటెర్న్ ఛార్జ్ కార్ సాకెట్ లో ఛార్జ్ చేస్తున్నాను. అన్ని కార్ లో సర్దేశాం.. గ్యారేజ్ క్లోజ్ అవ్వలేదు (నాలుగో సిగ్నల్)..
దేవుడు ఎందుకో ఆపుతున్నాడు… తెల్సుకోవట్లా…. సరే… మొత్తానికి ఎలాగో అలాగే గ్యారేజ్ క్లోజ్ చేశాను.. కారు లో ఎక్కి కూర్చున్నాం… కారు స్టార్ట్ అవ్వలేదు (ఐదో సిగ్నల్).. పక్కింటి అతన్ని పిలిచి జంపర్ తో కార్ స్టార్ట్ చేసాం.. హమ్మయ్య కారు స్టార్ట్ అయ్యింది అనుకున్నాం… కానీ ధైర్యం సరిపోలేదు. మధ్యలో కారు ఆగిపోతే కష్టం అని వెళ్లే ప్లాన్ విరమించుకున్నాం. కారు బయట ఉంచి లోపలి వచ్చి గ్యారేజ్ ఓపెన్ చేద్దామని చూసా కారు లోపల పెడదామని.. కానీ ఓపెన్ అవ్వలేదు (ఆరో సిగ్నల్).. మొత్తానికి కారు బయటే ఉంచి లోపలి వచ్చేసాం. ఇంకా ఇవాళ ముహూర్తం బాలేదు అనుకున్నాం. (పెద్దగా నమ్మకం లేదు ఇలాటి వాటి మీద).. కానీ ఎదో శక్తి బలంగా ఆపింది. అంత మంచికే అనుకుని ఈ రోజు రాత్రి కాండిల్ లైట్ డిన్నర్ చేసాం.
మా ఊరు మొత్తం కటిక చీకటి. ఒకప్పుడు ఇండియా లో పల్లెటూళ్ళ లో రాత్రి కరెంటు ఉండేది కాదు. అలాగే కనిపించింది. చల్లని గాలి.. తలుపులన్నీ తీసి చల్లని గాలి లో కాండిల్ లైట్ లో డిన్నర్ చేసి హాల్ లో పడుకోవటానికి ఉపక్రమించాం. ఇంతలో శ్రీ రామ్ బయటికి వెళ్లి వొచ్చాడు. వస్తూ వస్తూ సోఫా లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. కబుర్ల తో పాటు కరెంటు కూడా తీసుకు వచ్చాడు. సరే లక్ బావుంది అనుకున్నాం. హాయిగా 11 :00 గం|| స్నానము చేసి పడుకున్నాం, సరే రేపు చూసుకుందాం లే అనుకున్నాం.
ఇంతకీ మనం అనుకున్నదల్లా మనం చేయలేము. ఒకప్పుడు డెన్వర్, కొలరాడో నుండి అట్లాంటా వరకు అప్పటికప్పుడు హుటా హుటిన బయలుదేరి వెళ్లే వాళ్ళం. కానీ అన్ని వేళల మనకి కాలం, Nature అనుకూలించదు కదా… ఏదయినా మన మంచికే.. ఇక ఈ కదా కంచికే… టైం ఇప్పుడెను 11:౩౦ pm . మరి ఉంటానే!! గుడ్ నైట్
ఈ కథ కమల పరచ (Kamala Paracha) అక్క కి అంకితం.. ఎందుకంటే కమల అక్క బుక్స్ ఇన్స్పిరేషన్ కాబట్టి
చాలా బాగా రాసారు.
థాంక్యూ థాంక్యూ వెరీమచ్.